Telangana High Court: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం

Posted by admin on 2025-02-15 04:14:09 | Last Updated by admin on 2025-04-23 17:42:29

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 81


Telangana High Court: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి,
జస్టిస్ సుజన కలాసికంలతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న తాత్కాలిక సీజే జస్టిస్ సుజయ్పాల్

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి, జస్టిస్ సుజన కలాసికంలు ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సుజయ్పాల్ వీరితో ప్రమాణం చేయించారు. అంతకుముందు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ ఎస్.గోవర్ధన్రెడ్డి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, నూతనంగా నియమితులైన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్కుమార్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరళ్లు మహమ్మద్ ఇమ్రాన్ఖాన్, తేరా రజనీకాంత్రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Search
Leave a Comment: