Posted by admin on 2025-02-17 05:54:12 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 83
హైదరాబాద్: కొత్త వైరస్ లు కొత్త జబ్బు లు ఈ పేరు వింటేనే జనా లు హడలిపోతున్నారు. జీబిఎస్ వ్యాధి సోకిన కేసు లు ఏపీలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా కమలమ్మ అనే ఓ 50ఏళ్ల మహిళ ఓ జబ్బు తో మరణించింది. దీంతో జనంలో మరింత భయం పెరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ రెండు రోజుల క్రితమే వ్యాధి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ లో చేరింది. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు చెప్పారు.
రాష్ట్రంలో ఈ కొత్త వ్యాధి సోకి చనిపోయిన తొలి మహిళ ఇమే కావడంతో వైద్యులు కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రజలను అప్రమత్త చేయడంతో పాటు జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 17 మందిలో ఈ వ్యాధి లక్షణా లు ఉన్నట్లు గుర్తించగా, గుంటూరు జీజీహెచ్ లోనే ఏడుగురు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జీజీహెచ్ కు కమలమ్మను తీసుకువచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి న వైద్యులు ఇది జీబీఎస్ గా నిర్థారించారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు మరె వరిలో లేవని తేల్చారు. ఓ పక్క కోళ్లలో వచ్చిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనుషుల్లో నూ గుర్తించారు. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు బయట పడింది. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈభయాం దోళనలో ఉండగానే మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర భయాందోళ నకు గురిచేస్తోంది. ఏపీకి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఇటీవల ఇది తెలంగాణ లోనూ ప్రవేశించింది. ఏపీలో ఏకంగా మొదటి మరణానికి కారణమైంది.